Medaram Jatara: మేడారం సమ్మక్క, సారలమ్మ చిన్న జాతర తేదీలు ఖరారు

Medaram Mini Jathara dates announced

  • ఈరోజు సమావేశమై తేదీలను ఖరారు చేసిన పూజారులు
  • వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుంచి నాలుగు రోజుల పాటు చిన్న జాతర
  • మేడారం జాతర జరిగిన మరుసటి ఏడాది మినీ జాతర ఆనవాయతీ

మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం మినీ జాతరను వచ్చే ఏడాది ఫిబ్రవరి 12వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించాలని మేడారం పూజారులు నిర్ణయించారు. మేడారం జాతర రెండేళ్లకోసారి జరుగుతుంది. ఈ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవార్ల దర్శనం కోసం వస్తారు.

మేడారం జాతర జరిగిన ఏడాది తర్వాత చిన్న జాతరను నిర్వహిస్తారు. ఇది ఆనవాయతీగా వస్తోంది. ఈరోజు సమావేశమైన పూజారులు తేదీలను ప్రకటించారు. జాతరకు సంబంధించిన ఏర్పాట్లను ప్రారంభించాలని రాష్ట్ర దేవాదాయ శాఖను మేడారం పూజారుల సంఘం కోరింది.

  • Loading...

More Telugu News