WTC: డబ్ల్యూటీసీ: టెస్టు సిరీస్ లో ఓడినా టీమిండియానే టాప్... కానీ!

Team India tops WTC chart despite lost test series to New Zealand

  • న్యూజిలాండ్ చేతిలో రెండో టెస్టులో ఓడిపోయిన టీమిండియా
  • టెస్టు సిరీస్ ను కూడా కోల్పోయిన వైనం
  • టీమిండియా పాయింట్ల పర్సంటేజీ డ్రాప్

ఎలాగైనా ఈసారి వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) గెలవాలని కోరుకుంటున్న టీమిండియాకు ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్ తో రెండో టెస్టులో టీమిండియా 113 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. తద్వారా సిరీస్ ను కూడా కోల్పోయింది. 

ఈ ఓటమితో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానానికి ఢోకా లేనప్పటికీ, రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాకు టీమిండియాకు మధ్య అంతరం బాగా తగ్గిపోయింది. టీమిండియా ఖాతాలో 98 పాయింట్లు ఉండగా, ఆస్ట్రేలియా ఖాతాలో 90 పాయింట్లు ఉన్నాయి. 

ముఖ్యంగా, పాయింట్ల పర్సెంటేజీ బాగా పడిపోయింది. పాయింట్ల పర్సంటేజీ పరంగా... రెండు జట్ల మధ్య అంతరం మరీ స్వల్పంగా ఉంది. టీమిండియా పాయింట్ల పర్సంటేజీ 62.82 కాగా... ఆసీస్ పర్సెంటేజీ 62.50గా ఉంది. 

ఇక, న్యూజిలాండ్ విషయానికొస్తే... టీమిండియాపై 2-0తో టెస్టు సిరీస్ గెలిచినప్పటికీ, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆ జట్టు నాలుగో స్థానంలో ఉంది. ఆ జట్టు ఖాతాలో 60 పాయింట్లు ఉండగా, పాయింట్ల పర్సెంటేజీ 50గా ఉంది.

  • Loading...

More Telugu News