Chandrababu: ఆ రెండింటి జోలికి వెళ్లొద్దు... పార్టీ నేత‌లకు చంద్ర‌బాబు మరోసారి స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Chandrababu Naidu Warning to TDP Leaders

  • మంగళగిరిలో టీడీపీ సభ్యత్వ నమోదును ప్రారంభించిన బాబు
  • మద్యం, ఇసుక వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని హెచ్చ‌రిక‌
  • ఎవరైనా ఇసుక దందా చేస్తే తిరుగుబాటు చేయాలని కార్యకర్తలకు సూచన‌
  • అలాగే మద్యం కూడా ఎమ్మార్పీ ధరలకే విక్ర‌యించాల‌ని ఆదేశం

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన‌ చంద్ర‌బాబు మ‌రోసారి పార్టీ నేత‌లు, కార్యకర్తలకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. మద్యం, ఇసుక వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని హెచ్చ‌రించారు. 

ఎవరైనా ఇసుక దందా చేస్తే తిరుగుబాటు చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఇసుక విధానంలోకి చొరబడి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని వైసీపీ కుట్ర చేస్తుందని బాబు పేర్కొన్నారు. అలాగే మద్యం కూడా ఎమ్మార్పీ ధరలకే విక్ర‌యించాల‌ని తెలిపారు. ఎవ‌రైనా ఎమ్మార్పీ కంటే అధిక ధ‌ర‌ల‌కు అమ్మితే క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌న్నారు.  

గ‌త‌ వైసీపీ పాలనలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని, వారి త్యాగాలను గుర్తుంచుకుని సముచిత న్యాయం చేస్తామన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు ఇస్తున్న‌ట్లు బాబు చెప్పుకొచ్చారు. ఇటీవల జరిగినవి ఎన్నికలు కాదని రాక్షసుడితో యుద్ధమని పేర్కొన్నారు. 

పార్టీకి గ్రామం నుంచి రాష్ట్రం వరకూ పటిష్టమైన యంత్రాంగం ఉందన్నారు. నాలుగు దశాబ్దాల్లో ఎన్నో సంక్షోభాలు దాటామని తెలిపారు. అలాగే పార్టీ ఆవిర్భావం నుంచి పేదల సంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామ‌ని అన్నారు. 

  • Loading...

More Telugu News