BSNL: దూసుకుపోతున్న బీఎస్ఎన్ఎల్.. వరుసగా రెండో నెలలోనూ...!

tariff hike bsnl benefits second month consecutively reliance jio airtel face declines

  • ప్రైవేటు టెలికం కంపెనీలు రీఛార్జి ధరలను పెంచడంతో బీఎస్ఎన్ఎల్‌పై ఆసక్తి
  • పెరుగుతున్న బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు 
  • కస్టమర్లను కోల్పోతున్న ప్రముఖ ప్రైవేటు టెలికం కంపెనీలు  

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)కు వినియోగదారులు విపరీతంగా పెరుగుతున్నారు. ప్రముఖ ప్రైవేటు టెలికం కంపెనీలు ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ రీ చార్జ్ ప్లాన్‌లను దాదాపు 25 శాతం పెంచినప్పటికీ బీఎస్ఎన్ఎల్ మాత్రం రీఛార్జి ప్లాన్ ధరలను పెంచకపోవడంతో బీఎస్ఎన్ఎల్ పట్ల ప్రైవేటు టెలికం కంపెనీ వినియోగదారులు (యూజర్స్) ఆకర్షితులు అవుతున్నారు. 

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత గత జులై నెలలో ప్రైవేటు టెలికం కంపెనీలు ప్రీ పెయిడ్, పోస్టు పెయిడ్ రీఛార్జి ప్లాన్ ధరలను 25 శాతం పెంచాయి. దీంతో ప్రైవేటు టెలికం కంపెనీ యూజర్స్ పోర్టు (port) పెట్టి బీఎస్ఎన్ఎల్ వినియోగదారులుగా మారిపోతున్నారు. దీంతో ప్రైవేటు టెలికం సంస్థలు ప్రతి నెలా వినియోగదారులను భారీగా కోల్పోతున్నాయి. 

బీఎస్ఎన్ఎల్ జులై నెలలో మార్కెట్ వాటాలో 7.59 శాతం వినియోగదారులను పెంచుకుంది. గత ఆగస్టు నెలలో 7.84 శాతం వినియోగదారులను పెంచుకోవడం విశేషం. ఆగస్టు నెలలో బీఎస్ఎన్ఎల్‌కు 25 లక్షల మంది వినియోగదారులు పెరగ్గా, అంతకు ముందు నెల జులైలో 29.4 లక్షల మంది ఖాతాదారులు పెరిగారు. ఈ గణాంకాలను టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వెల్లడించింది.  
 
ట్రాయ్ గణాంకాల ప్రకారమే.. రిలయన్స్ జియో 40 లక్షల మంది యూజర్స్‌ను కోల్పోయింది. భారతీ ఎయిర్ టెల్ 24 లక్షలు, వోడా ఫోన్ ఐడియా 18.7 లక్షల వినియోగదారులను కోల్పోయాయి. అంతకు ముందు నెల జులైలో రిలయన్స్ జియో 7,58,463 మందిని, భారతీ ఎయిర్ టెల్ 16,94,300ల మందిని, వోడాఫోన్ ఐడియా 14,13,463 మంది వినియోగదారులను కోల్పోయాయి. మూడు ప్రైవేటు కంపెనీలు ఆగస్టు నెలలో 83 లక్షలు, జులై నెలలో 38.6లక్షల కస్టమర్‌లను కోల్పోవడం జరిగింది.  

  • Loading...

More Telugu News