Stock Market: భారత స్టాక్ మార్కెట్ సూచీలకు ఇవాళ కూడా కష్టాలే!

Indian stock market indics ended with red today

  • అమ్మకాల ఒత్తిడితో నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
  • నష్టపోయిన టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు
  • లాభాల బాటలో ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్

భారత స్టాక్ మార్కెట్ నేడు కూడా నష్టాలతో ముగిసింది. ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాలు మినహా, మిగిలిన అన్ని రంగాల్లో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో సెన్సెక్స్, నిఫ్టీ తీవ్రంగా నష్టపోయాయి. 

సెన్సెక్స్ 662.87 పాయింట్ల నష్టంతో 79,402.99 వద్ద ముగియగా... నిఫ్టీ 218.60 పాయింట్లు నష్టపోయి 24,180.80 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ మధ్యాహ్నం తర్వాత 800 పాయింట్ల మేర నష్టపోయినప్పటికీ, ముగింపు సమయానికి కొద్దిగా కోలుకుంది. 

ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, హిందూస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల బాటలో పయనించగా... ఇండస్ ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, మారుతి, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ షేర్లు నష్టపోయాయి.

  • Loading...

More Telugu News