Konda Surekha: కేటీఆర్ పరువునష్టం దావా.. మంత్రి కొండా సురేఖపై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు
![Nampally Court Fires On Minister Konda Surekha Comments On KTR](https://imgd.ap7am.com/thumbnail/cr-20241025tn671b4653097ff.jpg)
- కేటీఆర్ దాఖలు చేసిన రూ.100 కోట్ల పరువునష్టం దావాను విచారించిన కోర్టు
- బాధ్యత కలిగిన పదవిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని వ్యాఖ్య
- ఒక ప్రజా ప్రతినిధి నుంచి ఇలాంటి మాటలు రావడం తీవ్ర అభ్యంతకరమన్న కోర్టు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేటీఆర్ దాఖలు చేసిన రూ.100 కోట్ల పరువునష్టం దావాను ఈరోజు న్యాయస్థానం విచారించింది.
విచారణలో భాగంగా బాధ్యత కలిగిన పదవిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కోర్టు పేర్కొంది. అందులోనూ ఒక ప్రజా ప్రతినిధి నుంచి ఇలాంటి మాటలు రావడం తీవ్ర అభ్యంతకరం అని తెలిపింది.
అలాంటి వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయంది. మరోసారి కేటీఆర్‌పై అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించింది. ఆమె వ్యాఖ్యలను మీడియా, సోషల్ మీడియా, ఇతర ప్లాట్‌ఫామ్‌ల నుంచి వెంటనే తొలగించాలని న్యాయస్థానం ఆదేశించింది.