TS High Court: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు భారీ ఊరట... కాంగ్రెస్ నేత పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
- 2023లో ఆసిఫాబాద్ నుంచి గెలిచిన కోవా లక్ష్మి
- కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అజ్మీరా శ్యాం
- అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అజ్మీరా శ్యాం పిటిషన్
హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి భారీ ఊరట దక్కింది. కోవా లక్ష్మి ఎన్నిక చెల్లదంటూ ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేత, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అజ్మీరా శ్యాం నాయక్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఆమె తప్పుడు సమాచారం ఇచ్చారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు అజ్మీరా శ్యాం పిటిషన్‌ను కొట్టివేసింది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కోవా లక్ష్మీ ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యాంపై 22 వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. అయితే ఎన్నికల అఫిడవిట్‌లో ఆమె తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆమె ఎన్నిక చెల్లదంటూ అజ్మీరా శ్యాం కోర్టుకు వెళ్లారు.