jagapathi babu: అవార్డులపై జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు

jagapathi babu sensational comments on awards
  • విలన్ పాత్రల్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న జగపతిబాబు
  • జగపతిబాబుకు బెస్ట్ పర్ఫామెన్స్ ఇన్ నెగిటివ్ రోల్ అవార్డు 
  • దుబాయ్‌లో జరిగిన ఇఫా 2024 అవార్డుల కార్యక్రమంలో బెస్ట్ విలన్ అవార్డును అందుకున్న జగపతిబాబు
  • ఎంత ఎదవ లాగా చేస్తే అన్ని అవార్డులు వస్తాయని వ్యాఖ్యానించిన జగపతిబాబు
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకున్న జగపతి బాబు .. ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్‌లో పవర్ ఫుల్ విలన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కేవలం తెలుగు సినిమాల్లోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ మూవీల్లో విలన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు. కన్నడ నాట సూపర్ హిట్‌గా నిలిచిన 'దర్శన్ కాటేరా' మూవీలో జగపతిబాబు విలన్ పాత్రలో నటించగా, ఆయనకు బెస్ట్ పర్ఫామెన్స్ ఇన్ నెగిటివ్ రోల్ ఆవార్డు లభించింది. 

దుబాయ్‌లో జరిగిన ఇఫా 2024 అవార్డుల కార్యక్రమంలో ఆయన బెస్ట్ విలన్ అవార్డును అందుకున్నారు. ఆ సమయంలో జగపతిబాబు సంచలన కామెంట్స్ చేశారు. 'ఎంత ఎదవ లాగా చేస్తే అన్ని అవార్డులు వస్తాయి' అంటూ జగపతి బాబు కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. జగపతి బాబు చేసిన కామెంట్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. జగపతిబాబు చేసిన వ్యాఖ్యల వెనుక కారణం ఏమైనా ఉందా? అన్న చర్చ జరుగుతోంది. అవార్డుల మీద సరైన అభిప్రాయం లేకపోవడంతోనే ఆయన అలా కామెంట్స్ చేసి ఉంటాడని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. అవార్డుల మీద సరైన అభిప్రాయం లేకపోతే దుబాయ్ వరకూ ఆయన ఎందుకు వెళతారు? అని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు.   
 
 
jagapathi babu
Movie News
Isha 2024 Awards

More Telugu News