Suicide: బాచుపల్లి ప్రైవేటు కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Inter student commits suicide

  • దసరా సెలవుల తర్వాత నిన్న హాస్టల్ వద్ద దించిన తల్లిదండ్రులు
  • స్పృహతప్పి పడిపోయినట్లు తొలుత సమాచారం ఇచ్చిన కాలేజీ యాజమాన్యం
  • తర్వాత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని వెల్లడించిన యాజమాన్యం

హైదరాబాద్‌లోని బాచుపల్లిలో ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అయితే కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు తొలుత స్పృహతప్పినట్లుగా సమాచారం ఇచ్చింది. తల్లిదండ్రులు కాలేజీకి వచ్చాక చనిపోయినట్లు చెప్పారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థినిని అనూషగా గుర్తించారు.

అనూష దసరా సెలవులకు ఇంటికి వెళ్లి, తిరిగి ఆదివారం కాలేజీ హాస్టల్‌కు వచ్చింది. నిన్న తల్లిదండ్రులు హాస్టల్‌లో వదిలేసి వెళ్లిన కాసేపటికే ఆమె స్పృహతప్పి పడిపోయిందంటూ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. కానీ వారు అప్పటికి హైదరాబాద్ కూడా దాటలేదు.

తల్లిదండ్రులు వెంటనే కాలేజీకి తిరిగి రాగా... ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు వచ్చే లోపే కళాశాల సిబ్బంది, బాచుపల్లి పోలీసులు అనూష మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

Suicide
Crime News
Hyderabad
Telangana
  • Loading...

More Telugu News