Narendra Modi: ప్రధాని మోదీకి రూ.100 పంపించిన ఒడిశా గిరిజన మహిళ.. ఎందుకో తెలుసా?

a tribal woman in Odisha handed over Rs 100 to BJP leader to convey thanks to PM Narendra Modi

  • కృతజ్ఞతలు తెలియజేయాలంటూ బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండాకి అందించిన మహిళ
  • డబ్బు వద్దని వారించినా పట్టుబట్టి మరీ ఇచ్చిన మహిళ
  • బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియలో ఆసక్తికర ఘటన

ఒడిశాలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. సుందర్‌గఢ్ జిల్లాలో పార్టీ సభ్యత్వ డ్రైవ్‌ జరుగుతుండగా ఓ గిరిజన మహిళ రూ.100 తీసుకొచ్చి ప్రధాని నరేంద్రమోదీకి ఇవ్వాలంటూ బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ జై పాండాకి అందజేసింది. ‘ప్రధాని మోదీకి నా ధన్యవాదాలు తెలియజేయండి’ అని ఆమె కోరారు. రూ. 100 వద్దని జైజయంత్ చెప్పినప్పటికీ ఆమె వినలేదు. పట్టుబట్టి మరీ డబ్బు ఇచ్చి వెళ్లింది. ఇందుకు సంబంధించిన వివరాలు, ఫొటోలను ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేశారు.

‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలియజేయడానికి రూ. 100 తీసుకోవాలని ఈ ఆదివాసీ మహిళ పట్టుబట్టింది. ఆమె నా వివరణలను పట్టించుకోలేదు. చివరకు నేను డబ్బు తీసుకునే వరకు పట్టుబట్టింది. ఈ పరిణామం ఒడిశాలోని భారత్ పరివర్తనకు ప్రతిబింబం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

ఈ ఘటన తన దృష్టికి రావడంతో మోదీ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ‘వికసిత్ భారత్‌' కోసం కృషి చేసేలా 'నారీ శక్తి' ఆశీర్వాదం తనకు స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు ‘‘ఈ ఆప్యాయత నన్ను కదిలిస్తోంది. నన్ను ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తున్న నారీ శక్తికి నమస్కరిస్తున్నాను. వారి ఆశీస్సులు వికసిత్ భారత్‌ నిర్మాణం దిశగా నిరంతరం కృషి చేసేందుకు నన్ను ప్రోత్సహిస్తాయి’’ అని వివరించారు.

  • Loading...

More Telugu News