Nara Lokesh: విశాఖలో మంత్రి నారా లోకేశ్ ఆకస్మిక తనిఖీలు... లైబ్రరీ తెరవకపోవడంపై అసహనం

Nara Lokesh inspects Library and School in Vizag
  • విశాఖపట్నంలో మంత్రి నారా లోకేశ్ పర్యటన
  • నెహ్రూ బజార్ లో ప్రాంతీయ గ్రంథాలయం, ఎలిమెంటరీ స్కూల్లో తనిఖీలు
  • గ్రంథాలయం మూసివేసి ఉండడాన్ని గుర్తించిన లోకేశ్
మంత్రి నారా లోకేశ్ విశాఖలో పర్యటిస్తున్నారు. ఇవాళ నగరంలో పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నెహ్రూ బజార్ లో ఉన్న ప్రాంతీయ గ్రంథాలయాన్ని, మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలను తనిఖీ చేశారు. ఉదయం 8 గంటలకు తెరవాల్సిన లైబ్రరీ... 9.45 గంటలకు కూడా మూసివేసి ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా గ్రంథాలయాల బలోపేతానికి మంత్రి లోకేశ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ లైబ్రరీల  పర్యవేక్షణకు ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని నిర్ణయించారు. విద్యార్థులు, నిరుద్యోగులు కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి దేశంలోనే బెస్ట్ మోడల్ ను అధ్యయనం చేసి రాష్ట్రంలో  పబ్లిక్ లైబ్రరీల వ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించారు. 

అనంతరం మున్సిపల్ ఎలిమెంటరీ స్కూలును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ బాలల గదిని సందర్శించిన లోకేశ్... కొద్దిసేపు వారితో సరదాగా గడిపారు. ఏ, బీ, సీ, డీ లు... రైమ్స్ వచ్చా అని అడగ్గా... వారు ఆడుతూ పాడుతూ సమాధానాలు ఇచ్చారు. గుడ్లు, పౌష్టికాహారం సరఫరాపై టీచర్లను ఆరాతీశారు. విద్యార్థులకు చాక్లెట్లు పంచి, వారితో కలిసి లోకేశ్ ఫోటో దిగారు.
Nara Lokesh
Inspection
Library
School
Vizag

More Telugu News