RBI: మేం పోలీసులం కాదంటూ... ఆర్బీఐ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు

RBI Chief Day After 4 Firms Banned From Giving Loans

  • పోలీసుల మాదిరి వ్యవహరించలేమన్న శక్తికాంతదాస్
  • మార్కెట్‌పై నిఘా మాత్రమే ఉంచుతామని వెల్లడి
  • అవసరమైన సమయంలో నియంత్రణ చర్యలు చేపడతామన్న ఆర్బీఐ గవర్నర్

ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) మార్కెట్‌పై నిఘా మాత్రమే ఉంచుతుందని, కానీ పోలీసుల మాదిరి వ్యవహరించలేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫైనాన్షియల్ మార్కెట్‌పై గట్టి నిఘా మాత్రం ఉంటుందని స్పష్టం చేశారు. అవసరమైన సమయంలో నియంత్రణ చర్యలు చేపడతామన్నారు.

నవీ ఫిన్‌సర్వ్ లిమిటెడ్ సహా నాలుగు సంస్థలు రుణాలు మంజూరు చేయకుండా ఆర్బీఐ నిన్న ఆంక్షలు విధించింది. మరుసటి రోజే ఆర్బీఐ గవర్నర్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా, అక్టోబర్ 21వ తేదీ నుంచి కొత్త రుణాలను మంజూరు చేయవద్దని నవీ ఫిన్‌సర్వ్ సహా నాలుగు సంస్థలను ఆర్బీఐ ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించినట్లు వెల్లడి కావడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News