Supreme Court: జీవో 29 రద్దు అంశం... సుప్రీంకోర్టుకు గ్రూప్-1 అభ్యర్థులు

Group 1 candidates seek SC intervention

  • జీవో 29ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్
  • ఈ జీవోతో తమకు నష్టం జరుగుతోందన్న గ్రూప్-1 అభ్యర్థులు
  • విచారణను సోమవారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీవో 29 వల్ల కలిగే నష్టాన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే జీవో 29 రద్దు పిటిషన్‌పై సోమవారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది.

అయితే, తీర్పు వచ్చే వరకు పరీక్షను వాయిదా వేయాలని పిటిషనర్ లు కోరారు. జీవో 29 వల్ల తమకు నష్టం జరుగుతుందని గ్రూప్-1 అభ్యర్థులు న్యాయవాది ద్వారా కోర్టుకు తెలిపారు. ఈ జీవో శాపంగా మారిందని తెలిపారు. జీవో 55ను అమలు చేయాలని తాము సీఎంను కోరినప్పటికీ పట్టించుకోలేదని కోర్టుకు తెలిపారు. తమను పోలీస్ స్టేషన్‌లో ఉంచి ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. అనంతరం, సుప్రీంకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఏం జరిగింది?

దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో 55కు సవరణ తీసుకువస్తూ ఫిబ్రవరి 8న జారీ చేసిన జీవో 29ను రద్దు చేయాలని గ్రూప్-1 అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

జనరల్ కేటగిరీలోని అభ్యర్థుల కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారిని అన్‌రిజర్వుడుగానే పరిగణిస్తుండటం వల్ల దివ్యాంగ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందన్నారు. దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించిన వివాదం నేపథ్యంలో గ్రూప్-1 పరీక్షలను నిలిపివేయాలని కొందరు అభ్యర్థులు కోరారు. అయితే హైకోర్టు ఇందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

  • Loading...

More Telugu News