amazon prime video: ఇక అమెజాన్ ప్రైమ్ లో వాణిజ్య ప్రకటనలు!

amazon prime video to introduce ads for subscribers in india

  • అమెజాన్ ప్రైమ్ సంస్థ కీలక నిర్ణయం
  • ఆదాయాన్ని పెంచుకునే దిశగా చర్యలు
  • తన స్ట్రీమింగ్ వేదికగా యాడ్స్ అందించేందుకు సిద్ధమవుతున్న అమెజాన్

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఆదాయాన్ని పెంచుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో తన స్ట్రీమింగ్ వేదికగా యాడ్స్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అమెజాన్ తన వెబ్ సైట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇప్పటి వరకూ తన స్ట్రీమింగ్ వేదికగా అమెజాన్ యాడ్స్ అందించలేదు. ఒకవేళ యాడ్ ఫ్రీ కంటెంట్ కావాలనుకునేవారు అధిక ధరతో తీసుకొచ్చే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. 
 
ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో .. ఆస్ట్రేలియా, కెనడా, మెక్సికో, బ్రిటన్, అమెరికాతో పాటు పలు యూరోపియన్ దేశాల్లోని యూజర్లకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో యాడ్స్ ను ప్రచారం చేస్తుండగా, భారత్ లోనూ ఈ ప్రకటనలను 2025 నాటికి ప్రవేశపెట్టాలని భావిస్తోంది. తాజాగా అమెజాన్ తీసుకోబోయే నిర్ణయంతో సినిమాలు, షోలు చూస్తున్న సమయంలో యాడ్స్ ప్రత్యక్షమవుతాయి. అయితే ఇతర వేదికల కంటే యాడ్స్ తక్కువగానే ఉంటాయని కంపెనీ వెల్లడించింది. త్వరలోనే కొత్త ప్లాన్ వివరాలు ప్రకటిస్తామని కంపెనీ పేర్కొంది. 

  • Loading...

More Telugu News