low pressure: వచ్చే వారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!

imd predicts low pressure likely to form over bay of bengal by october 22nd rain alert to andhra pradesh

  • తీరం దాటిన వాయుగుండం
  • బంగాళాఖాతంలో అక్టోబర్ 22న మరో అల్పపీడనం
  • ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించిన వాతావరణ శాఖ

ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు వీడటం లేదు. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు దంచికొట్టాయి. వాయుగుండం తీరం దాటింది, ఇక ముప్పు వీడిందని ప్రజలు భావిస్తుండగా, వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో అక్టోబర్ 22న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజులు వాతావరణం క్రింది విధంగా ఉండనున్నట్లు ఆయన వివరించారు.  

అక్టోబర్ 18, శుక్రవారం
కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

అక్టోబర్ 19, శనివారం
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

అక్టోబర్ 20, ఆదివారం
కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అలూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

అక్టోబర్ 21, సోమవారం
అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
కాగా, గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో 80.5 మిమీ, విశాఖ రూరల్ లో 62.2 మిమీ, శ్రీకాకుళం జిల్లా వజ్రకొత్తూరులో 60.7 మిమీ వర్షపాతం నమోదైందని ఆయన వెల్లడించారు. 

  • Loading...

More Telugu News