Konda Surekha: కొండా సురేఖపై పరువునష్టం కేసు... రేపు నాంపల్లి కోర్టుకు కేటీఆర్

KTR to appear in Nampally court tomorrow

  • పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్
  • సాక్షుల వాంగ్మూలం కూడా నమోదు చేయనున్న కోర్టు
  • సాక్షులుగా బాల్క సుమన్, సత్యవతి, తుల ఉమ, దాసోజు శ్రవణ్ పేర్లు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఉదయం నాంపల్లి ప్రత్యేక కోర్టుకు హాజరు కానున్నారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఆయన పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో ఆయన కోర్టుకు హాజరై స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్ కూడా వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఉదయం 11.30 గంటలకు కేటీఆర్ నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు.

కొండా సురేఖ తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, పరువుకు నష్టం కలిగించారంటూ కేటీఆర్ ఈ నెల 3న నాంపల్లి క్రిమినల్ కోర్టులో పరువునష్టం కేసు వేశారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 14న విచారణ జరిపిన న్యాయస్థానం విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది. కేటీఆర్ సహా సాక్షుల వాంగ్మూలాలను శుక్రవారం నాడు నమోదు చేస్తామని కోర్టు తెలిపింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు రేపు కోర్టుకు హాజరు కానున్నారు. కాగా, కోర్టులో 23 రకాల ఆధారాలను కేటీఆర్ తరఫు న్యాయవాది సమర్పించారు.

  • Loading...

More Telugu News