Betting App Racket: విశాఖలో బెట్టింగ్ యాప్ ముఠా గుట్టు రట్టు

Vizag police busted betting app racket

  • విశాఖ కేంద్రంగా భారీ ఎత్తున బెట్టింగ్ యాప్ దందా
  • ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • వందల సంఖ్యలో డెబిట్ కార్డులు, బ్యాంకు చెక్ బుక్ లు స్వాధీనం
  • 10 ల్యాప్ టాప్ లు, 8 డెస్క్ టాప్ లు, ఓ కారు, బైకు స్వాధీనం
  • 800 అకౌంట్లతో లావాదేవీలు! 

విశాఖ పోలీసులు ఓ బెట్టింగ్ యాప్ దందాను బట్టబయలు చేశారు. ఈ ముఠా విశాఖ కేంద్రంగా బెట్టింగ్ యాప్ సాయంతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వందల సంఖ్యలో డెబిట్ కార్డులు, బ్యాంకు చెక్ బుక్ లను, 10 ల్యాప్ టాప్ లు, 8 డెస్క్ టాప్ లు, ఓ కారు, బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

దీనిపై విశాఖ పోలీస్ కమిషనర్ వివరాలు తెలిపారు. అహ్మదాబాద్ నుంచి వచ్చిన సమాచారంతో విచారణ జరిపామని వెల్లడించారు. సైబర్ నేరస్తులకు చైనాతో సంబంధాలున్నాయని, రకరకాల పేర్లతో బెట్టింగ్ యాప్ లు నిర్వహిస్తున్నారని తెలిపారు. 

ఆర్బీఐ అనుమతి లేకుండానే బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్నారని, బెట్టింగ్ యాప్ సొమ్మును చైనా, తైవాన్ దేశాలకు పంపిస్తున్నారని సీపీ వివరించారు. దాదాపు 800 ఖాతాలతో వీరు లావాదేవీలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News