Seethakka: పోడు భూముల విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించవద్దు: అటవీ అధికారులకు మంత్రి సీతక్క సూచన

Seethakka warning to forest officers

  • పోడు భూముల విషయంపై స్పందించిన మంత్రి సీతక్క
  • సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడి
  • కులగణనకు సంబంధించి వాస్తవ నివేదికను తయారు చేయాలని అధికారులకు సూచన

పోడు భూముల విషయంలో అటవీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని మంత్రి సీతక్క సూచించారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఆమె మాట్లాడుతూ... ఆదివాసీలకు ఆత్మగౌరవం, అస్తిత్వాన్ని కల్పించిన పోరాటయోధుడు కొమురం భీమ్ అన్నారు. ఆయన లేకపోతే తన ఉనికి లేదన్నారు. ఆయన పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ సాధించుకున్నామన్నారు.

సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. లక్షా అరవై వేల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చామన్నారు. పోడు భూముల విషయంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని సూచించారు. గిరిజనులకు అన్ని విషయాల్లో అవగాహన కల్పించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి త్వరలో జోడేఘాట్‌కు వస్తారన్నారు. అటవీ ప్రాంతంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

కులగణన జరుగుతోందని... అధికారులకు అందరూ సమాచారం ఇవ్వాలని సూచించారు. నాయక్ పోడు తెగలు మైదాన ప్రాంతాల్లో ఉన్నారని, కాబట్టి అధికారులు వాస్తవ నివేదికను తయారు చేయాలని సూచించారు. ఆదివాసీ చట్టాలను తీసుకు వచ్చిన ఘనత కాంగ్రెస్‌దే అన్నారు. సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా ముందుకు వెళతామన్నారు. 

  • Loading...

More Telugu News