Stock Market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

Stock market indics closed in red

  • కార్పొరేట్ రాబడులు గణనీయంగా తగ్గిన వైనం
  • అంతర్జాతీయ విపణి నుంచి బలహీన సంకేతాలు
  • 494 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 221 పాయింట్ల నష్టం చవిచూసిన నిఫ్టీ

కార్పొరేట్ రాబడులు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో, ఆ ప్రభావం భారత స్టాక్ మార్కెట్ సూచీలపై పడింది. అంతర్జాతీయ విపణి నుంచి మిశ్రమ సంకేతాలు వెలువడడం మార్కెట్ సెంటిమెంట్లను బలహీనపరిచింది. సెన్సెక్స్, నిఫ్టీ నేడు నష్టాలతో ముగిశాయి. 

సెన్సెక్స్ 494.75 పాయింట్లు నష్టపోయి 81,006 వద్ద ముగిసింది. నిఫ్టీ 221.45 పాయింట్లు నష్టపోయి 24,749 వద్ద స్థిరపడింది. ఐటీ రంగం మినహా అన్ని రంగాలు అమ్మకాల ఒత్తిళ్లకు గురయ్యాయి. 

ఆటోమొబైల్, పీఎస్ యూ బ్యాంకులు, ఫిన్ సర్వ్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, మెటల్, మీడియా, ప్రైవేటు బ్యాంకులు, రియాల్టీ, ఇన్ ఫ్రా, ఎనర్జీ, హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో ప్రాఫిట్ బుకింగ్ ట్రెండ్ కనిపించింది. 

ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎల్ అండ్ టీ షేర్లు లాభాల బాటలో పయనించగా... బజాజ్ ఆటో, శ్రీరామ్ ఫైనాన్స్, నెస్లే, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి.

  • Loading...

More Telugu News