TTD: వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌.. స్వామివారి మెట్టుమార్గం మూసివేసిన టీటీడీ

Due to Heavy Rains The Foot Way Closed by TTD
  • భ‌క్తుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా టీటీడీ చ‌ర్య‌లు
  • భ‌క్తుల వ‌స‌తి, ద‌ర్శ‌నాల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఏర్పాట్లు
  • భారీ వర్షాల కారణంగా ఇప్ప‌టికే వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు
భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందంటూ వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించ‌డంతో టీటీడీ ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌కు ఉపక్ర‌మించింది. స్వామివారి మెట్టుమార్గాన్ని మూసివేసింది. ఈ నేప‌థ్యంలోనే టీటీడీ భ‌క్తుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంది.  

భ‌క్తుల వ‌స‌తి, ద‌ర్శ‌నాల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది. కొండ‌చ‌రియ‌ల‌పై నిఘా పెట్టి, ఘాట్ రోడ్ల‌లో ట్రాఫిక్ జామ్ కాకుండా చ‌ర్య‌లు తీసుకుంటోంది. మ‌రోవైపు వాయుగుండం తీరం దాట‌డం, వ‌ర్షాలు లేక‌పోవ‌డంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. 

ఇక వర్షాల నేపథ్యంలో శ్రీవారి పాదాలు, ఆకాశ గంగ, జాపాలి, పాపవినాశనానికి భక్తులను టీటీడీ అనుమతించడం లేదు. అలాగే భారీ వర్షాల కారణంగా భక్తుల భద్రత దృష్ట్యా ఇప్పటికే తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన విష‌యం తెలిసిందే.
TTD
Heavy Rains
Andhra Pradesh
Tirumala

More Telugu News