Border-Gavaskar Trophy 2024-25: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ: అనిల్ కుంబ్లే సలహాను పట్టించుకోవద్దన్న దొడ్డ గణేశ్

Dodda Ganesh rejects Anil Kumble over KL Rahul the opener suggestion

  • వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టుకు రోహిత్ దూరం?
  • అదే జరిగితే కేఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా పంపాలన్న కుంబ్లే
  • అలాంటి పనిచేయవద్దన్న మాజీ ఆటగాడు దొడ్డ గణేశ్
  • రోహిత్ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌‌కు చోటివ్వాలని సూచన

 ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగే 'బోర్డర్-గవాస్కర్' ట్రోఫీకి టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ అందుబాటులో లేకుంటే కేఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా పంపాలన్న భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే సూచనను మాజీ ఆటగాడు దొడ్డ గణేశ్ కొట్టిపడేశాడు. ఆ అవసరం లేదని, రాహుల్‌ను మిడిలార్డర్‌లోనే దింపాలని సూచించాడు. క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ వచ్చే నెల 22న ప్రారంభం కానుంది. 

తొలి టెస్టుకు స్కిప్పర్ రోహిత్‌శర్మ అందుబాటులో ఉండడం లేదని తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టుకు అందుబాటులో ఉండడం లేదని రోహిత్ ఇప్పటికే బీసీసీఐకి తెలిపినట్టు వార్తలొచ్చాయి. ఈ ప్రతిష్ఠాత్మక ట్రోఫీకి ముందు కెప్టెన్ అందుబాటులో లేకపోవడం జట్టును కలవరపరుస్తోంది. అతడి స్థానంలో క్వాలిటీ ప్లేయర్ అందుబాటులో లేకపోవడమే అందుకు కారణం. ఇది భారత జట్టుకు తలనొప్పిగా మారింది. 

రోహిత్ స్థానంలో ఎవరు?
రోహిత్ కనుక అందుబాటులో లేకుంటే శుభమన్ గిల్, కేఎల్ రాహుల్‌లలో ఒకరు ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. గతంలోనూ వీరు ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సందర్భాలున్నాయి. అయితే, గత కొన్ని సిరీస్‌లలో గిల్ మూడో నంబర్‌లో వస్తుండగా, రాహుల్ నంబర్ 5లో వస్తున్నాడు. వీరితోపాటు బ్యాకప్ కీపర్‌ను కూడా తీసుకునే ఆలోచన కూడా ఉంది.
 
రాహుల్‌ను ఓపెనర్‌గా పంపాలి 
ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు రోహిత్ అందుబాటులో లేని పక్షంలో కేఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా పంపాలని టీమిండియా దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే సలహా ఇచ్చాడు. జట్టు కోరుకున్న విధంగా అతడు ఆడగలడని పేర్కొన్నాడు. రాహుల్ ద్రవిడ్‌లా అవసరమైతే కీపింగ్ బాధ్యతలను కూడా చూసుకుంటాడని వివరించాడు. 

రాహుల్‌ను మిడిలార్డర్‌లోనే పంపాలి 
రాహుల్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించాలన్న కుంబ్లే సలహాను మాజీ ఆటగాడు దొడ్డ గణేశ్ కొట్టిపడేశాడు. రోహిత్‌శర్మ అందుబాటులో లేకుంటే అభిమన్యు ఈశ్వరన్‌కు టెస్టు క్యాప్ అందించాలని సూచించాడు. రాహుల్ మిడిలార్డర్ బ్యాటర్ కాబట్టి అతడిని డిస్టర్బ్ చేయవద్దని సలహా ఇచ్చాడు. రోహిత్ గైర్హాజరీలో అభిమన్యును టెస్టు జట్టులోకి తీసుకోవడమే మంచిదని గణేశ్ సూచించాడు. 

  • Loading...

More Telugu News