Jaya Prada: ప్రజాప్రతినిధుల కోర్టులో జయప్రదకు ఊరట

former mp jaya prada acquitted in code of conduct violation case

  • ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు కొట్టివేసిన న్యాయస్థానం
  • కేసు నుంచి విముక్తి దక్కడంపై జయప్రద హర్షం
  • రాంపూర్ రాకుండా అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారని మండిపాటు

ప్రజా ప్రతినిధుల కోర్టులో మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదకు భారీ ఊరట లభించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో ఆమెను రాంపూర్‌లోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 2019 ఎన్నికల్లో జయప్రద ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేశారు. అయితే, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ అనుమతి లేకుండా సూర్‌పుర్‌లో బహిరంగ సభ నిర్వహించి, రోడ్డును ప్రారంభించారన్న ఆరోపణలు ఆమెపై వచ్చాయి. 

ఆ క్రమంలో స్వార్ పోలీస్ స్టేషన్‌లో జయప్రదపై కేసు నమోదయింది. ఈ కేసును విచారించిన ప్రజా ప్రతినిధుల న్యాయస్థానం .. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. జయప్రదపై కోడ్ ఉల్లంఘన కేసును న్యాయస్థానం కొట్టేసిందని ఆమె తరపు న్యాయవాది అరుణ్ ప్రకాశ్ సక్సేనా మీడియాకు వెల్లడించారు.

కేసు నుంచి విముక్తితో హర్షం
ప్రజా ప్రతినిధుల కోర్టు తనను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు ఇవ్వడంపై జయప్రద హర్షం వ్యక్తం చేశారు. తనను రాంపూర్ రాకుండా అడ్డుకోవాలని కొందరు కుట్రలు పన్నుతున్నారని, కానీ ఇది తనకు రెండో ఇల్లు అని, మళ్లీ మళ్లీ ఇక్కడికి వస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తానని జయప్రద ప్రకటించారు. 

యూపీలోని సంభాల్ జిల్లాలోని కుందార్కి అసెంబ్లీ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ పార్టీ అగ్రనేతలు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నడచుకుంటానని జయప్రద స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News