HYDRA: ఆ భవనాల కూల్చివేత అధికారం హైడ్రాకు లభించింది: హైడ్రా కమిషనర్ రంగనాథ్

HYDRA commissioner Ranganath on building demolitions

  • అక్రమ నిర్మాణాలు, అనధికారిక కట్టడాలకు సంబంధించి హైడ్రానే నోటీసులు ఇస్తుందని వెల్లడి
  • జీహెచ్ఎంసీ చట్టసవరణతో హైడ్రాకు పూర్తిస్థాయి అధికారాలు వచ్చాయన్న రంగనాథ్
  • ప్రభుత్వ ఉత్తర్వులతో హైడ్రా మరింత బలపడిందన్న కమిషనర్

అనధికారిక భవనాల కూల్చివేత అధికారం కూడా హైడ్రాకు లభించిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాకు జీహెచ్ఎంసీ చట్టంలోని అధికారాలను బదిలీ చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రంగనాథ్ మాట్లాడుతూ... నగర పరిధిలో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు, అనధికారిక కట్టడాలకు సంబంధించి ఇకపై హైడ్రానే నోటీసులు జారీ చేస్తుందన్నారు.

జీహెచ్ఎంసీ చట్టసవరణతో హైడ్రాకు పూర్తిస్థాయి అధికారాలు వచ్చాయన్నారు. ఇకపై ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం హైడ్రానే నోటీసులు ఇస్తుందని వెల్లడించారు. కూల్చివేతలు, స్వాధీనం సహా తదితర అధికారాలన్నీ హైడ్రాకు లభించాయని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల వల్ల హైడ్రా మరింత బలపడిందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 27 మున్సిపాలిటీల్లో పురపాలక చట్టం ప్రకారం హైడ్రా నడుచుకుంటుందన్నారు.

  • Loading...

More Telugu News