Harish Rao: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పు ఇదే: హరీశ్ రావు

Harish Rao fires at Congress government

  • ఉన్న పథకాలను బంద్ పెట్టడమే  కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని విమర్శ
  • అభివృద్ధి నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపాటు
  • ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్న హరీశ్ రావు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పు... ఉన్న పథకాలు నిలిపివేయడమేనని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఎద్దేవా చేశారు. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి నిధులు ఇవ్వ‌కుండా కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేస్తోందన్నారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి రూ.5 కోట్లు ఇస్తామ‌ని బ‌డ్జెట్‌లో చెప్పిన ప్రభుత్వం... ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. వెంట‌నే నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి నిధులు విడుద‌ల చేయాలని డిమాండ్ చేశారు.

మహిళలకు రెండు బతుకమ్మ చీరలు ఇస్తానన్న రేవంత్ రెడ్డి ఒక్కటి కూడా ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు. రూ.15 వేలు రైతుబంధు ఇస్తానని చెప్పి గుండుసున్నా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కంటే మంచి కిట్ ఇస్తానని చెప్పి పేద గర్భిణీలను మోసం చేశాడని ధ్వజమెత్తారు. ఆగస్ట్‌లోనే వేయాల్సిన చేప పిల్లలను అక్టోబర్ వచ్చినా వేయలేదని మండిపడ్డారు. చేప పిల్లలకు బడ్జెట్ కూడా కేవలం రూ.16 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు.

ముఖ్య నేతల కోసం ఓఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్‌మెంట్ మార్చారని హరీశ్ రావు ఆరోపించారు. రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలోని కొంతమంది నేత‌లు త‌మ స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతున్నార‌న్నారు. దక్షిణ భాగాన్ని కేంద్రం నిర్మించాలని, కానీ కావాలనే రాష్ట్ర ప్రభుత్వం తాము నిర్మిస్తామని చెబుతోందన్నారు.

  • Loading...

More Telugu News