JioBharat V3: బోల్డన్ని ఫీచర్లు.. అతి తక్కువ ధర.. జియో భారత్ వి3, వి4 4జీ ఫోన్లను లాంచ్ చేసిన రిలయన్స్

Reliance Launched JioBharat V3 V4 4G Feature Phones

  • మొబైల్ కాంగ్రెస్ 2024లో ప్రదర్శించిన రిలయన్స్ 
  • ప్రారంభ ధర రూ. 1,099 మాత్రమే
  • నవతరం యూజర్లను ఆకట్టుకునేలా డిజైన్
  • ప్రీలోడెడ్‌గా జియో డిజిటల్ సర్వీసులు
  • 455 లైవ్ టీవీ చానళ్లు.. జియో పేతో పేమెంట్లు

రిలయన్స్ జియో నుంచి మరో రెండు కొత్త 4జీ ఫీచర్ ఫోన్లు వచ్చేశాయి. మొబైల్ కాంగ్రెస్ 2024లో ‘జియో భారత్ వి3’, ‘వి4’ ఫోన్లను లాంచ్ చేసింది. రూ. 1,099 ప్రారంభ ధరతో తీసుకొచ్చిన ఈ ఫోన్లు మిలియన్ల మంది 2జీ యూజర్లు 4జీకి మారేందుకు అవకాశం కల్పించనున్నాయి. గతంలో తీసుకొచ్చిన ‘జియో భారత్ వి2’ ఫోన్లు సక్సెస్ కావడంతో డిజిటల్ డ్రైవ్‌ను మరింత వేగవంతం చేసే లక్ష్యంతో రిలయన్స్ ఈ సరికొత్త ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లతో డిజిటల్ సర్వీసులు అరచేతిలోనే అందుబాటులో ఉంటాయి. 

వి3, వి4 ఫోన్ల డిజైన్లు రెండూ నవతరం యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. తక్కువ ధరలోనే ప్రీమియం ఫీల్‌ను అందించేలా వీటిని తీర్చిదిద్దారు. స్టైల్, పెర్మార్మెన్స్‌ విషయంలో రాజీలేకుండా రూపొందించారు. రెండింటిలోనూ జియో డిజిటల్ సర్వీసులు ప్రీలోడెడ్‌గా వస్తాయి. జియో టీవీ ద్వారా 455 లైవ్ టీవీ చానళ్లను వీక్షించొచ్చు. ఫేవరెట్ షోలు, న్యూస్, స్పోర్ట్స్, జియో సినిమా వంటివి విస్తృతంగా అందుబాటులో ఉంటాయి. అలాగే, డిజిటల్ పేమెంట్స్ కోసం జియో పే ఉంటుంది. జియో చాట్ ద్వారా స్నేహితులు, కుటుంబానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండొచ్చు. ఫొటో షేరింగ్, గ్రూప్ చాట్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. 

వి3, వి4 రెండు ఫోన్లు 1000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తాయి. 128 జీబీ వరకు విస్తరించుకోవచ్చు. 23 భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది. వీటిని రూ. 123తో రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, 14 జీబీ డేటా లభిస్తుంది. అంటే మిగతా టెలికం కంపెనీలతో పోలిస్తే 40 శాతం ఆదా చేసుకోవచ్చు. త్వరలోనే ఈ ఫోన్లు జియోమార్ట్, అమెజాన్‌తో దేశవ్యాప్తంగా అన్ని స్టోర్లలోనూ అందుబాటులోకి వస్తాయి. 

  • Loading...

More Telugu News