Work From Home: బెంగళూరులో కుంభవృష్టి... ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

IT firms announces work from home to employees due to heavy rains in Bengaluru

  • బంగాళాఖాతంలో అల్పపీడనం
  • చురుగ్గా కదులుతున్న ఈశాన్య రుతుపవనాలు
  • బెంగళూరు నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు
  • చెరువులా మారిన మాన్యతా టెక్ పార్క్ 
  • తమ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించిన ప్రముఖ టెక్ సంస్థలు

బంగాళాఖాతంలో అల్పపీడనానికి ఈశాన్య రుతుపవనాలు కూడా తోడవడంతో దక్షిణాది రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, బెంగళూరు వంటి నగరాలు భారీ వర్షాలతో జలమయం అయ్యాయి. 

ముఖ్యంగా, బెంగళూరులో ఇవాళ కుంభవృష్టి కారణంగా అనేక ప్రాంతాలు నీటి ముంపునకు గురయ్యాయి. వాటిలో ముఖ్యమైనది మాన్యతా టెక్ పార్క్. ఈ టెక్ పార్క్ లో అనేక ప్రముఖ ఐటీ కంపెనీల కార్యాలయాలు ఉన్నాయి. మాన్యతా టెక్ పార్క్ వద్ద భారీగా నీరు నిలవడంతో పాటు, ఈ టెక్ పార్క్ కు దారి తీసే రోడ్లు కూడా జలమయం అయ్యాయి. దాంతో ట్రాఫిక్ దాదాపుగా స్తంభించిపోయింది. 

ఈ నేపథ్యంలో, ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థలు తమ ఉద్యోగులు ఆఫీసుకు రానవసరం లేకుండా వెసులుబాటు కల్పించాయి. రేపు (అక్టోబరు 16) వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఇంటి వద్ద నుంచే పనిచేయాలని సూచించాయి. అటు ఆర్జీయే టెక్ పార్క్, విప్రో గేట్, ఐటీపీఎల్, ఎలక్ట్రానిక్స్ సిటీలో చాలా ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. 

కాగా, పలు టెక్ సంస్థల ఉద్యోగులు వచ్చే రెండ్రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. భారీ వర్షాలు ఇప్పట్లో తగ్గేట్టు కనిపించడంలేదని, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం వల్ల ఇలాంటి పరిస్థితుల్లో నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని టెక్కీలు అభిప్రాయపడుతున్నారు. 

  • Loading...

More Telugu News