Devara: దేవర చిత్రానికి నా హృదయంలో ప్రత్యేక స్థానం వుంటుంది: ఎన్టీఆర్
![Devara film has a special place in my heart NTR](https://imgd.ap7am.com/thumbnail/cr-20241015tn670e72e6abe41.jpg)
- దేవర విజయం పట్ల సంతోషంలో ఎన్టీఆర్
- థాంక్యూ నోట్‌ను విడుదల చేసిన దేవర
- విజయానికి కారణమైన అందరికి కృతజ్ఞతలు తెలిపిన ఎన్టీఆర్
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం దేవర. సెప్టెంబరు 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి ప్రారంభ వసూళ్లతో మొదలై బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. సినిమా విడుదలై 19 రోజులు దాటినా ఇప్పటికి ఈ చిత్రం థియేటర్స్‌ల్లో వసూళ్లను రాబడుతుంది. దేవర, వర పాత్రల్లో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయానికి ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు.
ఇక ఈ చిత్రం సాధించిన విజయంతో ఆనందంలో ఉన్న ఎన్టీఆర్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక థాంక్యూ నోట్‌ను విడుదల చేశారు. ఎక్స్ వేదికగా ఆయన ఖాతాలో ఈ నోట్‌ను పోస్ట్ చేశారు. దేవర పార్ట్ 1 విజయానికి కారణమైన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ప్రేక్షకులకు, సినీ పరిశ్రమ మిత్రులకు, ఆయన అభిమానులకు ఈ థాంక్యూ నోట్‌లో కృతజ్క్షతలు తెలియజేశారు.
![](https://img.ap7am.com/froala-uploads/20241015fr670e72a7236a3.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20241015fr670e72b8ef137.jpg)