Maharashtra: మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే... నవంబర్ 23న ఫలితాలు

Maharashtra and Jharkhand election dates announced

  • మహారాష్ట్రలో ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు
  • అక్టోబర్ 22న నోటిఫికేషన్, 29 వరకు నామినేషన్ల స్వీకరణ
  • ఝార్ఖండ్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు

మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం నేడు ప్రకటించింది. మహారాష్ట్రలో ఒకే దశలో, ఝార్ఖండ్‌లో రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. మహారాష్ట్రలో నవంబర్ 20న, ఝార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబర్ 23న చేపట్టనున్నట్లు తెలిపారు.

మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్

అక్టోబర్ 22న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్
అక్టోబర్ 29 వరకు నామినేషన్ల స్వీకరణ
నవంబర్ 4 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు
నవంబర్ 20న పోలింగ్
నవంబర్ 23న ఓట్ల లెక్కింపు

ఝార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్

అక్టోబర్ 18న మొదటి దశ, అక్టోబర్ 22న రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్
అక్టోబర్ 25 వరకు మొదటి దశ, అక్టోబర్ 29 వరకు రెండో దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ
అక్టోబర్ 30 వరకు మొదటి దశ, నవంబర్ 1 వరకు రెండో దశ నామినేషన్ల ఉపసంహరణకు గడువు
నవంబర్ 13న మొదటి దశ, నవంబర్ 20న రెండో దశ పోలింగ్
నవంబర్ 23న ఓట్ల లెక్కింపు

మహారాష్ట్రలో 288 నియోజకవర్గాలు ఉన్నాయి. 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 20.93 లక్షలమంది తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం 1,00,186 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

ఝార్ఖండ్‌లో 81 నియోజకవర్గాలు ఉండగా, 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 11.84 లక్షల మంది తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

  • Loading...

More Telugu News