Kakani Govardhan Reddy: అదే జరిగితే టీడీపీ ఇక రెండేళ్లు మాత్రమే అధికారంలో ఉంటుంది: కాకాణి గోవర్ధన్

Kakani Govardhan fires on Chandrababu

  • జమిలీ ఎన్నికలు జరిగితే టీడీపీ ప్రభుత్వం రెండేళ్లు మాత్రమే ఉంటుందన్న కాకాణి
  • టీడీపీ నేతలు చెప్పినట్టుగా చేయవద్దని అధికారులకు హెచ్చరిక
  • ఎల్లో బ్యాచ్ బాగు కోసమే చంద్రబాబు మద్యం పాలసీ అని విమర్శ

జమిలి ఎన్నికలపై వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2027లో జమిలి ఎన్నికలు జరిగేట్టయితే, టీడీపీ ఇక రెండేళ్లు మాత్రమే అధికారంలో ఉంటుందని అన్నారు. ఈ లోపు టీడీపీ నేతలు చెప్పినట్టుగా అధికారులు నడుచుకోవద్దని, వారి మాటలు వినే అధికారులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. 

కొత్త మద్యం దుకాణాల్లో 90 శాతం టీడీపీ నేతలకే దక్కాయని కాకాణి అన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే లాటరీ ప్రక్రియ కొనసాగిందని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే షాపుల ఎంపిక జరిగిందని అన్నారు. ఎల్లో బ్యాచ్ బాగు కోసమే చంద్రబాబు మద్యం పాలసీని ప్రకటించారని విమర్శించారు. రాష్ట్రంలోని డిస్టిలరీలన్నీ టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే ఉన్నాయని... నాసిరకం మద్యాన్ని తక్కువ ధరకు అమ్ముతారని చెప్పారు. 

రాష్ట్రంలో బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా రానున్నాయని కాకాణి అన్నారు. రాబోయే రోజుల్లో లిక్కర్ ను డోర్ డెలివరీ కూడా చేస్తారని చెప్పారు. మద్యం దుకాణాల కేటాయింపుల్లో చంద్రబాబు మూడంచెల విధానాన్ని అమలు చేస్తారని అన్నారు. రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, గ్రామ స్థాయిలో బెల్ట్ షాపులతో కింది స్థాయి నాయకులు దోచుకుంటారని చెప్పారు.

  • Loading...

More Telugu News