Sajjala Ramakrishna Reddy: వైసీపీ కీలక నేత సజ్జలపై లుక్ అవుట్ నోటీస్.. ఢిల్లీ విమానాశ్రయంలో అడ్డగింత!

Look Out Notice Against YCP Leader Sajjala

  • ముంబై నటి కాదంబరి జెత్వానీపై వేధింపుల కేసు
  • నిందితులుగా సజ్జల, అవినాశ్, తలశిల తదితరులు
  • నిందితులపై పోలీసుల లుక్ అవుట్ నోటీసులు

బాలీవుడ్ నటి కాదంబరి జెత్వానీపై వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై లుక్ అవుట్ నోటీసు జారీ అయింది. దీంతో ఆయనను ఢిల్లీ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తాను ఇప్పుడే విదేశాల నుంచి వచ్చానని వారికి వివరించారు. దీంతో ఆయనను ఏపీకి వెళ్లేందుకు అధికారులు అనుమతించినట్టు సమాచారం.

అయితే, అప్పటికే హైదరాబాద్ వెళ్లే విమానం టేకాఫ్ కావడంతో మరో విమానం కోసం వేచి చూడాల్సి వచ్చింది. జెత్వానీ కేసులో సజ్జలతోపాటు వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్, తలశిల రఘురాంపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీచేసినట్టు తెలిసింది. కాగా, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అవినాశ్, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి కూడా నిందితులుగా ఉన్నారు.

Sajjala Ramakrishna Reddy
Kadambari Jethwani
Look Out Notice
YSRCP
  • Loading...

More Telugu News