Deepak Babaria: ఎన్నికల్లో పరాభవం.. కాంగ్రెస్ హర్యానా ఇన్‌చార్జ్ రాజీనామా

Congress Haryana In charge Deepak Babaria Resigns

  • హర్యానా ఎన్నికల్లో 37 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ 
  • ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన దీపక్ బబారియా 
  • తన స్థానాన్ని మరొకరితో భర్తీ చేయాలన్న నేత
  • ఇప్పటి వరకు స్పందించని హైకమాండ్ 

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హర్యానా ఇన్‌చార్జ్ దీపక్ బబారియా తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్టు ఆయన పేర్కొన్నారు. అధిష్ఠానానికి రాజీనామా లేఖను సమర్పించినట్టు తెలిపారు. అయితే, హైకమాండ్ మాత్రం ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదని పేర్కొన్నారు. 

ఫలితాలు భిన్నంగా వచ్చిన తర్వాత రాజీనామా చేస్తానని ప్రకటించానని, తన స్థానాన్ని భర్తీ చేసుకోవచ్చని అధిష్ఠానాన్ని చెప్పినట్టు బబారియా తెలిపారు. అరోగ్య కారణాలతోపాటు ఫలితాలకు నైతిక బాధ్యత వహిస్తున్నానని, ఎవరైనా ఈ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటే వారిని నియమించాలని కోరినట్టు చెప్పానని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఢిల్లీ ఇన్‌చార్జ్‌గా ఉన్నప్పుడు కూడా రాజీనామా చేస్తానని చెప్పినా దానిపైనా అధిష్ఠానం నిర్ణయం తీసుకోలేదని గుర్తు చేసుకున్నారు. 

హర్యానాలోని 90 స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 37 స్థానాలతో సరిపెట్టుకుంది. బీజేపీ 48 స్థానాలు గెలుచుకుని వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. 

  • Loading...

More Telugu News