Liquor Shops: ఏపీలో కొనసాగుతున్న లిక్కర్ దుకాణాల లక్కీ డ్రా.. దరఖాస్తుదారుల ఆందోళన

Lucky draw for AP liquor shops continuous

  • రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు 89,882 మంది దరఖాస్తు
  • ఈ ఉదయం నుంచి కొనసాగుతున్న డ్రా
  • శ్రీకాకుళం జిల్లాలో 9 నంబర్్‌కు బదులుగా 6 ప్రకటన
  • అధికారులతో దరఖాస్తుదారుల వాగ్వివాదం
  • తప్పును సరిదిద్దిన అధికారులు

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల జారీకి జరుగుతున్న లక్కీ డ్రా గందరగోళంగా మారింది. ఉదయం నుంచే డ్రాలు తీస్తుండగా నంబర్లలో తప్పులు దరఖాస్తుదారుల ఆందోళనకు కారణమైంది. ఒక నంబర్‌కు బదులు మరో నంబర్ ప్రకటిస్తుండడంతో అధికారులతో దరఖాస్తుదారులు గొడవకు దిగుతున్నారు. 

శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న లాటరీ ప్రక్రియలో 9 నంబరుకు బదులు 6 నంబరును ప్రకటించడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. విషయం తెలిసిన దరఖాస్తుదారులు ఆందోళనకు దిగారు. దీంతో స్పందించిన అధికారులు అండర్ స్కోర్ విషయంలో పొరపాటు జరిగిందని పేర్కొంటూ ప్రకటనను వెనక్కి తీసుకుని దానిని 9గా ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించగా 89,882 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ.1797.64కోట్ల ఆదాయం వచ్చింది. కాగా, లాటరీలో మద్యం దుకాణాలను దక్కించుకున్న వ్యాపారులకు రేపు (15న) షాపులు అప్పగిస్తారు. 16 నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి వస్తుంది.

  • Loading...

More Telugu News