Telugudesam: టీడీపీ కార్యాలయంలో ప్రజావేదిక... పాల్గొననున్న మంత్రులు, నాయకుల షెడ్యూల్

Praja Vedhika at TDP Mangalagiri office

  • మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడి
  • ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరిస్తారని ప్రకటించిన కార్యాలయ కార్యదర్శి
  • 15 నుంచి 31వ తేదీ వరకు ప్రజావేదిక కార్యక్రమం

ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఆదేశాల మేరకు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు వెల్లడించారు. ఈ మేరకు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. 

15-10-2024 (మంగళవారం) నుండి ప్రజావేదిక కార్యక్రమంలో మంత్రులు, పార్టీ నాయకులు పాల్గొంటారని వెల్లడించారు. పార్టీ శ్రేణులకు వారు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. 14-10-2024 (సోమవారం) 'పల్లె పండుగ' కార్యక్రమం నిర్వహిస్తారని, ఈ నేపథ్యంలో ఆ రోజు ఎలాంటి గ్రీవెన్స్ ఉండదని స్పష్టం చేశారు.

ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు, నాయకుల షెడ్యూల్:

15.10.2024: మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ పార్లమెంట్ పార్టీ ప్రెసిడెంట్ గన్ని వీరాంజనేయులు.
16.10.2024: ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహార్.
17.10.2024: మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య.
18.10.2024: మంత్రి వంగలపూడి అనిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు యాదవ్.
19.10.2024: రాష్ట్ర మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు యాదవ్  
21.10.2024: మంత్రి కొలుసు పార్థసారథి, టీడీపీ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి.
22.10.2024: మంత్రి ఎస్.సవిత, టీడీపీ పార్లమెంటరీ పార్టీ ప్రెసిడెంట్ నెట్టెం రఘురాం.
23.10.2024: మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు.
24.10.2024: మంత్రి టీజీ భరత్, ఏపీటీడిసీ చైర్మన్ నూకసాని బాలాజీ.
25.10.2024: మంత్రి గొట్టిపాటి రవికుమార్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు యాదవ్ 
26.10.2024: మంత్రి అనగాని సత్యప్రసాద్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు యాదవ్ 
28.10.2024: మంత్రి డా.డోలా బాల వీరాంజనేయ స్వామి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి.
29.10.2024: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఏపీహెచ్‌సీ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు.
30.10.2024: మంత్రి నిమ్మల రామానాయుడు, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి.
31.10.2024: మంత్రి ఎన్ఎండి ఫరూక్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కంభంపాటి రామ్మోహన్ రావు.

  • Loading...

More Telugu News