Wall Collapse: గుజరాత్ లో మట్టిపెళ్లలు విరిగిపడి ఏడుగురి మృతి... ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

Seven labour died in wall collapse incident in Gujarat

  • మహెసాణా జిల్లాలో విషాద ఘటన
  • భవన నిర్మాణ స్థలంలో కార్మికులు పనిచేస్తుండగా విరిగిపడిన మట్టిపెళ్లలు
  • రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ

గుజరాత్ లో విషాదం చోటుచేసుకుంది. మట్టిపెళ్లలు విరిగిపడిన ఘటనలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. పలువురుగా గాయపడ్డారు. మహెసాణా జిల్లాలో ఓ భవన నిర్మాణ స్థలంలో ఈ ఘటన జరిగింది. 

మట్టిపెళ్లల కింద కార్మికులు సమాధి అయిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి (పీఎంఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేలు అందిస్తామని వెల్లడించారు. 

అటు, హర్యానాలో ఓ కారు కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో ఏడుగురు మృత్యువాతపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. కైతాల్ పరిధిలోని ముండ్రి వద్ద ఈ ప్రమాదం సంభవించింది.

  • Loading...

More Telugu News