Revanth Reddy: విశ్వవేదికపై తెలంగాణ సగర్వంగా నిలబడాలి: రేవంత్ రెడ్డి

Revanth Reddy greets TG people on Dasara

  • తెలంగాణ ప్రజలకు సీఎం విజయదశమి శుభాకాంక్షలు
  • సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన సీఎం
  • దసరా శుభాకాంక్షలు తెలిపిన హరీశ్ రావు

విశ్వవేదికపై తెలంగాణ సగర్వంగా నిలబడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. దసరా పర్వదినం సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, జన సంక్షేమానికి ప్రజాప్రభుత్వ సంకల్పం విజయపథాన సాగాలని రాసుకొచ్చారు. 

శుభాకాంక్షలు తెలిపిన హరీశ్ రావు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు దసరా పండుగ ప్రతిరూపమని... దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆకాంక్షించారు. ప్రజలందరికీ ఆయన దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. "శమీ శమయతే పాపం! శమీశతృ వినాశనీ!! అర్జునస్య ధనుర్ధారీ! రామస్య ప్రియదర్శినీ!!" అంటూ దసరా ట్వీట్‌లో రాసుకొచ్చారు.

More Telugu News