RS Praveen Kumar: రేవంత్ రెడ్డి గారూ... ఆ డబ్బులకు నేనే ప్రత్యక్ష సాక్షిని!: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

RS Praveen Kumar countr to Revanth Reddy for his comments on KCR

  • పేదలు బర్రెలు, గొర్రెలు పెంచుకుంటూ బతకాలని కేసీఆర్ భావించారని సీఎం విమర్శలు
  • సీఎం మాటలు విడ్డూరంగా ఉన్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్
  • కేసీఆర్ టైంలో ప్రతిభావంతులైన బిడ్డలకు క్షణాల్లో లక్షలు పడేవని వెల్లడి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేదలు, ఎస్సీ, ఎస్టీలు గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకుంటూ బతకాలని కేసీఆర్ భావించారని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గులో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు.

"రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ రోజు కొందుర్గులో మాట్లాడిన మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. కేసీఆర్ గారు ఎస్సీ, ఎస్టీలను గొర్రెలకు బర్రెలకు పరిమితం చేశారని మీరు నింద వేయడం గురించి రేపు అన్ని వివరాలతో మీడియాతో మాట్లాడుతాను కాని, ముందు మీ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల నుండి ముగ్గురు సాఫ్ట్ బాల్ క్రీడాకారులు తైవాన్ ఇంటర్నేషనల్ టోర్నీకి సెలక్ట్ అయ్యారు. వాళ్ల చార్జీలకు ఐదు లక్షల రూపాయలు కూడా మీ అధికారులు ఇవ్వడం లేదంట! ఆ పిల్లలు ఇక గొర్రెలు బర్రెలు కాయకపోతే ఏం చేస్తారు? కేసీఆర్ గారి టైంలో అయితే ఇలాంటి ప్రతిభావంతులైన బిడ్డలకు క్షణాల్లో లక్షల్లో డబ్బులు పడేవి. దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని" అని ప్రవీణ్ కుమార్ రాసుకొచ్చారు.

  • Loading...

More Telugu News