KCR: తెలంగాణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

BRS chief KCR greets people on eve of Dussehra

  • చెడు మీద నిత్యం పోరాటం చేస్తూ మంచి దిశగా సాగడమే విజయదశమి అన్న కేసీఆర్
  • తెలంగాణ ప్రజల జీవితాల్లో దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్న మాజీ సీఎం
  • అలాయ్ బలాయ్‌తో సామాజిక సామరస్యం పరిఢవిల్లుతుందన్న కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మ‌నిషి త‌న‌లోని చెడు మీద నిత్యం పోరాటం చేస్తూ మంచి దిశ‌గా విజ‌యం సాధించాల‌నే జీవ‌న తాత్విక‌త‌ను విజ‌య ద‌శ‌మి మ‌న‌కు తెలియ‌జేస్తుంద‌న్నారు. ద‌స‌రా రోజు శుభ‌సూచ‌కంగా పాల‌పిట్ట‌ను ద‌ర్శించి శమీ వృక్షానికి పూజ చేసి, జ‌మ్మి ఆకును బంగారంలా భావించి పెద్ద‌ల‌కు స‌మ‌ర్పించుకుని వారి ఆశీర్వాదం తీసుకోవ‌డం ఆచారమని గుర్తు చేశారు.

తెలంగాణ ప్ర‌జ‌ల జీవితాల్లో ద‌స‌రా పండుగ‌కు ప్ర‌త్యేక స్థానం ఉందని, అలాయ్ బ‌లాయ్ తీసుకుని ప‌ర‌స్ప‌ర ప్రేమాభిమానాల‌ను పంచుకోవ‌డం ద్వారా ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల నడుమ సామాజిక సామ‌ర‌స్యం పరిఢవిల్లుతుందన్నారు.

KCR
Telangana
Dasara
  • Loading...

More Telugu News