Aleem Dar: పీసీబీ షాకింగ్ నిర్ణ‌యం... సెలక్షన్ కమిటీలో మాజీ అంపైర్‌కు చోటు!

Umpire Aleem Dar Named Pakistan Selector Bizarre Move Stuns Everyone

  • ముల్తాన్‌లో ఇంగ్లండ్ చేతిలో పాకిస్థాన్‌కు ఘోర ప‌రాజ‌యం
  • ఈ ఓట‌మి త‌ర్వాత గంట‌ల వ్య‌వ‌ధిలోనే కొత్త సెల‌క్ష‌న్ క‌మిటీ ఎంపిక‌
  • ఈ క‌మిటీలో మాజీ అంపైర్ అలీం దార్‌, వ్యాఖ్యాత హ‌స‌న్ చీమాకు చోటు

ముల్తాన్‌లో పాకిస్థాన్‌కు ఇంగ్లండ్ చేతిలో ఏకంగా ఇన్నింగ్స్ 47 ప‌రుగుల తేడాతో ఘోర ఓట‌మి ఎదురైన విష‌యం తెలిసిందే. దీంతో పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) దేశ క్రికెట్‌లో ప్రక్షాళన మొద‌లెట్టింది. ఈ ప‌రాజ‌యం త‌ర్వాత గంట‌ల వ్య‌వ‌ధిలోనే కొత్త సెల‌క్ష‌న్ క‌మిటీని నియ‌మించింది. 

ఇందులో ఏకంగా మాజీ అంపైర్ అలీం దార్‌తో పాటు వ్యాఖ్యాత హ‌స‌న్ చీమాకు కూడా చోటు క‌ల్పించి అంద‌రినీ ఆశ్చర్యంలో ముంచేసింది. ఈ ఇద్ద‌రితో పాటు మాజీ టెస్టు ఆటగాళ్లు ఆఖిబ్‌ జావెద్‌, అజర్‌ అలీ కూడా ఈ సెల‌క్ష‌న్ క‌మిటీలో ఉన్నారు.  

దీంతో బోర్డు నుంచి అటువంటి పదవిని పొందిన మొదటి అంపైర్‌గా దార్ నిలిచాడు. ఆయ‌న‌ ఇటీవలే అంతర్జాతీయ అంపైరింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 56 ఏళ్ల దార్‌ తన 20 ఏళ్ల కెరీర్‌లో 448 అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించాడు.

దార్ 2003 నుండి ఐసీసీ ఎలైట్, ఇంటర్నేషనల్ ప్యానెల్స్‌లో ప్ర‌ముఖ‌ సభ్యుడిగా ఉన్నాడు. తన కెరీర్‌లో మూడుసార్లు ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్‌గా డేవిడ్ షెపర్డ్ ట్రోఫీని గెలుచుకున్నాడు.

కాగా, ఈ కొత్త సెలెక్షన్ కమిటీలో ప్రతి సభ్యుడికి ఓటింగ్‌ హక్కులుంటాయని పీసీబీ ప్రకటించింది. అయితే హెడ్‌ కోచ్‌ కిరెస్టన్‌, జాసన్‌ గిలిస్పీకి కూడా కమిటీలో స్థానం ఉంటుందా లేదా అనేది ఇంకా వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News