Chakrasnanam: తిరుమల శ్రీవారి చక్రస్నానానికి ఘనంగా ఏర్పాట్లు

TTD prepares for Chakrasnanam tomorrow
  • రేపటితో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు
  • చక్రస్నానానికి భక్తులు వేలాదిగా తరలివస్తారని అంచనా
  • 40 వేల సిబ్బంది సేవలు ఉపయోగించుకుంటామన్న టీటీడీ ఈవో
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. రేపు స్వామివారికి చక్రస్నానం ఘట్టం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భారీగా ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై టీటీడీ ఈవో జె.శ్యామలరావు మీడియాతో మాట్లాడారు.

బ్రహ్మోత్సవాల్లో చివరి అంకం చక్రస్నానానికి 30 వేల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. భక్తుల రాకకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఎంట్రీ గేట్లు, ఎగ్జిట్ గేట్లు ఏర్పాటు చేశామని... భద్రతాపరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని వివరించారు. 

మొత్తం 40 వేల మంది సిబ్బంది సేవలు వినియోగించుకుంటామని... పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారని ఈవో శ్యామలరావు వెల్లడించారు. స్వామివారి పుష్కరిణి వద్ద రెండు బోట్లు కూడా సిద్ధంగా ఉంచామని తెలిపారు.
Chakrasnanam
TTD
Tirumala

More Telugu News