Aanand: మూడేళ్లపాటు ఒక్క ఛాన్స్ కూడా రాకపోతే ఏ హీరోకైనా ఎలా ఉంటుంది?: ఆనంద్ 

Anand Interview

  • 'దొంగ దొంగ' సినిమాతో క్రేజ్ వచ్చిందన్న ఆనంద్ 
  • తమిళంలో దివ్యభారతి ఫస్టు హీరో తానేనని వెల్లడి 
  • సౌందర్య మరణం బాధించిందని వ్యాఖ్య  
  • ఆర్ధికంగా ఇబ్బందులు లేవని స్పష్టీకరణ   


హీరో ఆనంద్ .. నిన్నటి తరం హీరో. ఇప్పుడు ఆయన కేరక్టర్ ఆర్టిస్ట్. చాలాకాలం క్రితం మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'దొంగ దొంగ' సినిమా ఆయన కెరియర్ లో కీలకమైన సినిమా. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. " విక్రమ్ .. కార్తీక్ .. రెహమాన్ (రఘు)తో కలిసి నా ప్రయాణం కొనసాగింది. వాళ్లంతా ఇప్పటికీ నాకు మంచి ఫ్రెండ్స్. కెరియర్ మొదట్లో పెద్ద దర్శకుల సినిమాలలో చేయడం అదృష్టం తప్ప మరొకటి కాదు" అని అన్నారు. 

"నేను తెలుగు .. తమిళ .. మలయాళ సినిమాలు చేస్తూ వెళుతున్నాను. ఆ ధైర్యంతో సొంత ఇంటి నిర్మాణం మొదలుపెట్టాను. ఆశ్చర్యం ఏమిటంటే ఈ మూడు భాషలలో నాకు అవకాశాలు ఆగిపోయాయి. అలా మూడేళ్లపాటు ఒక్క ఛాన్స్ రాకపోవడం నాకు చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ తరువాత నుంచి ఇప్పటి వరకూ అలాంటి ఒక పరిస్థితిని చూడలేదు. అలా ఎందుకు జరిగిందనేది నాకు ఇప్పటికీ తెలియలేదు" అని చెప్పారు. 

" నా జీవితంలో నేను బాధపడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. 'రోజా' సినిమాలో హీరోగా నేను చేయవలసింది. కానీ ఆ ఛాన్స్ అరవింద్ స్వామికి వెళ్లింది. తమిళంలో దివ్యభారతి తొలి సినిమా హీరో నేనే. అప్పుడు నాకు 19 ఏళ్లు అయితే, ఆమెకి 16 .. 17 ఏళ్లు ఉంటాయేమో. సౌందర్య చనిపోవడం కూడా నన్ను కలచివేసింది. నేను సీరియల్స్ చేస్తున్నప్పుడు, ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదు" అని ఆయన అన్నారు. 

  • Loading...

More Telugu News