Nara Rohit: నటి మెడలో మూడుముళ్లు వేయబోతున్న టాలీవుడ్ హీరో నారా రోహిత్.. ఎల్లుండే ఎంగేజ్‌మెంట్?

Tollywood hero Nara Rohit to marry Siree Lella

  • బాణం సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన నారా రోహిత్
  • ‘ప్రతినిధి-2’ హీరోయిన్ సిరి లేళ్లతో ఎంగేజ్‌మెంట్!
  • అధికారికంగా రాని ప్రకటన

టాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో నారా రోహిత్ ఒకరు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సోదరుడి కుమారుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన నటించిన తొలి సినిమా ‘బాణం’తోనే అభిమానులను సంపాదించుకున్నారు. ఆ తర్వాత వరుసగా పలు సినిమాలు చేసిన ఆయన కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. 

రోహిత్‌ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కు వీడ్కోలు చెప్పబోతున్నారు. ఆయన పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని, ఎల్లుండే ఓ నటితో నిశ్చితార్థం జరగబోతోందని సమాచారం. ‘ప్రతినిధి-2’ మూవీలో ఆయన సరసన నటించిన సిరి లేళ్లనే పెళ్లాడబోతున్నట్టు టాలీవుడ్ సమాచారం. హైదరాబాద్‌లో జరగనున్న ఈ వేడుకకు చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబాలు హాజరు కాబోతున్నాయని చెబుతున్నారు. నారా రోహిత్ పెళ్లిపై సోషల్ మీడియా ఊదరగొడుతున్నా ఆయన నుంచి కానీ, కుటుంబ సభ్యుల నుంచి కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు.

Nara Rohit
Siree Lella
Tollywood
Nara Rohit Engagement
  • Loading...

More Telugu News