Kerala: 'వన్ నేషన్ వన్ ఎలక్షన్‌'పై కేరళ అసెంబ్లీ కీలక తీర్మానం... కేంద్రానికి విజ్ఞప్తి

Kerala assembly unanimously passes resolution opposing One Nation One Poll

  • సీఎం తరఫున తీర్మానాన్ని ప్రవేశపెట్టిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
  • ఈ ప్రతిపాదన అప్రజాస్వామికమని కేరళ అసెంబ్లీ తీర్మానం
  • ఖర్చులు తగ్గించేందుకు, సులభతరమైన పాలన కోసం ఇతర మార్గాలు ఉన్నాయని సూచన

వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రణాళికను రద్దు చేయాలంటూ కేరళ అసెంబ్లీ... కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేరళ అసెంబ్లీ గురువారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తరఫున ఆ రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎంబీ రాజేశ్ ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 

వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదన అప్రజాస్వామికమని కేరళ అసెంబ్లీ ఆరోపించింది. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా, ఈ ప్రతిపాదన దేశంలోని సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని తీర్మానంలో పేర్కొన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా దేశంలోని సామాజిక, సాంస్కృతిక, రాజకీయ వైవిధ్యాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందన్నారు.

ఖర్చులను తగ్గించడానికి, సులభతరమైన పాలనను నిర్ధారించడానికి ఇతర సులభ మార్గాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ప్రధానమైన సమాఖ్య నిర్మాణాన్ని నాశనం చేయడం, ప్రజల హక్కులను సవాల్ చేయడం, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక స్వపరిపాలన హక్కులను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదన ఉందని విమర్శించారు.

  • Loading...

More Telugu News