IAS: ఏపీకి కేటాయించాలన్న ఐదుగురు ఐఏఎస్ అధికారుల విజ్ఞప్తికి నో చెప్పిన కేంద్రం

Centre tells no to five IAS seeking AP cadre

  • ఏపీ, తెలంగాణ క్యాడర్ విభజనపై కేంద్రం కీలక నిర్ణయం
  • ఏ రాష్ట్ర క్యాడర్ ఆ రాష్ట్రంలోనే పనిచేయాలని స్పష్టీకరణ
  • తాజాగా ఏపీ నుంచి ఐదుగురు ఐఏఎస్ లను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు

ఏపీ, తెలంగాణ క్యాడర్ విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ క్యాడర్ కు చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులను ఏపీ నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తమను ఏపీలోనే కొనసాగించాలని ఆ అధికారుల అభ్యర్థనలను కేంద్రం తిరస్కరించింది. 

అనంతరాము, ఎస్ఎస్ రావత్, హరికిరణ్, సృజన, శివశంకర్ ఏపీ క్యాడర్ ను కోరుకోగా, కేంద్రం వారికి నో చెప్పింది. కేటాయించిన క్యాడర్ రాష్ట్రాల్లోనే కొనసాగాలని తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 

అటు, తెలంగాణ క్యాడర్ లోనే కొనసాగుతామన్న పలువురు ఉన్నతాధికారుల విజ్ఞప్తికి కూడా కేంద్రం అభ్యంతరం చెప్పిన సంగతి తెలిసిందే. దాంతో, తెలంగాణ నుంచి ఆమ్రపాలి, రొనాల్డ్ రాస్ వంటి ఐఏఎస్ లు ఏపీకి రానున్నారు.

  • Loading...

More Telugu News