Han Kang: దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్ కు నోబెల్ పురస్కారం

South Korea writer Han Kang wins Nobel Prize

  • సాహితీ రంగంలో నేడు నోబెల్ ప్రైజ్ ప్రకటన
  • తీవ్రతతో కూడిన వచన కవిత్వంతో గుర్తింపు తెచ్చుకున్న హాన్ కాంగ్
  • విశిష్ట పురస్కారానికి ఎంపిక

సాహితీ రంగంలో నేడు ప్రతిష్ఠాత్మక నోబెల్ ప్రైజ్ విజేతను ప్రకటించారు. దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్ ను నోబెల్ పురస్కారానికి ఎంపిక చేశారు. చారిత్రక వేదనలతో సంఘర్షిస్తూ, మానవ జీవిత దౌర్భల్యాన్ని ఎత్తిచూపేలా తీవ్రతతో కూడిన వచన కవిత్వం హాన్ కాంగ్ కలం నుంచి జాలువారిందని నోబెల్ కమిటీ పేర్కొంది. 

53 ఏళ్ల హాన్ కాంగ్ దక్షిణ కొరియాలోని గ్వాంగ్ జౌ నగరానికి చెందిన సుప్రసిద్ధ రచయిత్రి. ఆమె తండ్రి హాన్ సంగ్ ఒన్ నవలా రచయిత. 

సాహితీ కుటుంబంలో పుట్టిన హాన్ కాంగ్... యోన్సెల్ యూనివర్సిటీ నుంచి సాహిత్యంలో పట్టా అందుకున్నారు. అనేక రచనలతో కొరియా సాహితీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

  • Loading...

More Telugu News