Prashant Varma: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్ నుంచి 'మహాకాళీ'
- సూపర్‌హీరోలను మహాకాళీలో చూపిస్తామంటున్న ప్రశాంత్ వర్మ
- చెడుపై యుద్దం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుందటున్నమేకర్స్
- ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో 20 సినిమాల నిర్మాణం
హనుమాన్ చిత్రం సాధించిన విజయంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ పాపులారిటి అమాంతం పెరిగింది. త్వరలోనే ఆయన తన దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ద్వారా నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయనున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుంది.
ఇదిలా వుండగా తన సినిమాటిక్ యూనివర్స్ లో ప్రస్తుతం ఇరవై కథలు రెడీ అవుతున్నాయని, తొలి దశలో ఆరుగురు సూపర్ హీరోల సినిమాలు నిర్మిస్తామని గతంలోనే ప్రశాంత్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హనుమాన్‌కు సీక్వెల్‌గా రానున్న జై హనుమాన్ కంటే ముందు 'అధిర', మహాకాళీ సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా వున్నాయని ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో భాగంగా త్వరలో రానున్న ఓ చిత్రం అప్‌డేట్‌ను ప్రకటించారు.
గతంలో చెప్పినట్లుగానే మహాకాళీ అనే సినిమాను పీవీసీయూ (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్) రూపొందిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను, పోస్టర్‌ను ప్రమోషనల్ కంటెంట్‌గా విడుదల చేశారు. "చెడుపై యుద్దం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. మా సినిమాలో సూపర్‌హీరోలు ఎలా వుంటారో చూపిస్తాం" అని తెలిపారు ప్రశాంత్ వర్మ. ఈ చిత్రానికి పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ తదుపరి అప్‌డేట్‌లో తెలియజేయనున్నారు.
.