Ratan TATA: రతన్ టాటా సారధ్యంలో టాటా గ్రూపు ఏర్పాటు చేసిన కంపెనీల జాబితా ఇదిగో

Ratan Tata influence endures in the diverse sectors represented by the Tata Group today

  • 1991 నుంచి 2012 వరకు 21 ఏళ్లపాటు టాటా గ్రూప్ చైర్మన్‌గా వ్యవహరించిన రతన్ టాటా
  • ఆయన హయాంలో 30కి పైగా కంపెనీల ఎదుగుదల
  • అనేక బ్రాండ్లను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన భారతీయ వ్యాపార దిగ్గజం

విలువలతో కూడిన వ్యాపారవేత్తగా, దాతృత్వం, దయా గుణం కలిగిన టాటా గ్రూపు గౌరవ చైర్మన్ రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. టాటా గ్రూప్‌ను ప్రపంచ స్థాయిలో శక్తిమంతమైన కంపెనీగా నిలపడంలో రతన్ టాటా ఎనలేని కృషి చేసి విజయవంతమయ్యారు. నిరాడంబరమైన జీవనశైలి, దాతృత్వం పట్ల నిబద్ధతతో 1991 నుంచి 2012 వరకు టాటా గ్రూపు చైర్మన్‌గా వ్యవహరించారు. 21 ఏళ్ల పాటు టాటా గ్రూపునకు మార్గనిర్దేశం చేశారు. టాటా బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూనే జాగ్వార్, ల్యాండ్ రోవర్‌లతో పాటు పలు బ్రాండ్లను గ్లోబల్ స్థాయిలో టాప్ బ్రాండ్‌ల సరసన నిలిపారు.

ఆరు ఖండాల్లోని 100కు పైగా దేశాల్లో టాటా గ్రూపునకు చెందిన కార్యకలాపాలను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. వివిధ రంగాలలో 30 కంపెనీలకు చక్కటి మార్గదర్శకత్వం వహించారు. వ్యక్తిగత సంపద పోగు చేయడం కంటే సామాజిక బాధ్యతకే ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. అందుకే సంపన్నుల జాబితాలో ఆయన పేరు అగ్రస్థానంలో కనిపించదు. ఆయన అంకితభావానికి ఇంతకుమించిన నిదర్శనం ఏమీ ఉండదు.

కాగా మార్చి 1991లో జేఆర్‌డీ టాటా నుంచి చైర్మన్‌గా గ్రూపు బాధ్యతలు స్వీకరించాక వివిధ రంగాలకు వ్యాపారాలను విస్తరించారు. తన పదవీకాలంలో టాటా గ్రూపు కంపెనీలను అంతర్జాతీయ సంస్థలుగా మార్చారు. టెట్లీ, కోరస్, బ్రన్నర్ మోండ్, జనరల్ కెమికల్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, దేవూ వంటి అంతర్జాతీయ బ్రాండ్లను వ్యూహాత్మకంగా కొనుగోలు చేశారు. ఆయన చైర్మన్‌గా ఉన్న సమయంలో అనేక రంగాలలో కంపెనీలను స్థాపించడం లేదా కొనుగోలు చేయడం వంటి వాటితో విస్తరించారు. 

వివిధ రంగాలలో టాటా కంపెనీలు ఇవే..

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ‌ రంగంలో..
1. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)
2. టాటా ఎలగ్జీ
3. టాటా డిజిటల్
4. టాటా టెక్నాలజీస్

ఉక్కు రంగంలో..
5. టాటా స్టీల్

ఆటో మొబైల్స్ రంగంలో..
6. టాటా మోటార్స్
7. జాగ్వార్ ల్యాండ్ రోవర్
8. టాటా ఆటోకాంప్ సిస్టమ్

రిటైల్ రంగంలో..
9. టాటా కెమికల్స్
10. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్
11. టైటాన్ కంపెనీ
12. వోల్టాస్
13. ఇన్ఫినిటీ రిటైల్
14. ట్రెంట్

మౌలిక సదుపాయాల రంగంలో..
15. టాటా పవర్
16. టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్
17. టాటా రియాల్టీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
18. టాటా హౌసింగ్

ఫైనాన్సియల్ రంగంలో..
19. టాటా క్యాపిటల్
20. టాటా ఏఐఏ లైఫ్
21. టాటా ఏఐజీ
22. టాటా అసెట్ మేనేజ్‌మెంట్

ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో..
23. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్

టూరిజం, ట్రావెల్ రంగంలో...
24. ఇండియన్ హోటల్స్
25. టాటా ఎస్ఐఏ ఎయిర్‌లైన్స్
26. ఎయిర్ ఇండియా

టెలికమ్యూనికేషన్స్, మీడియా రంగంలో..
27. టాటా కమ్యూనికేషన్స్
28. టాటా ప్లే
29. టాటా టెలిసర్వీసెస్

ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ రంగంలో..
30. టాటా ఇంటర్నేషనల్
31. టాటా ఇండస్ట్రీస్
32. టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్

  • Loading...

More Telugu News