Mukesh Ambani: ఫోర్బ్స్ జాబితాలో మళ్లీ టాప్ ప్లేస్‌లోకి ముకేశ్ అంబానీ

Mukesh Ambani at top spot on Forbes Indias rich list again

  • ఇండియాలోని టాప్-100 సంపన్నుల జాబితాను విడుదల చేసిన ఫోర్బ్స్
  • మరోమారు అగ్రస్థానాన్ని పదిలపరుచుకున్న ముకేశ్ అంబానీ
  • సంపన్నుల నికర విలువ తొలిసారి ట్రిలియన్ డాలర్లు దాటినట్టు పేర్కొన్న ఫోర్బ్స్

ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీ ఫోర్బ్స్ జాబితాలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన దేశంలోని అత్యంత వందమంది సంపన్నుల జాబితాలో టాప్‌ ప్లేస్‌ను నిలుపుకున్నారు. ఈసారి టాప్-100లో చోటు సంపాదించిన సంపన్నులు తొలిసారి నికర విలువలో ట్రిలియన్ డాలర్లు దాటినట్టు ఫోర్బ్స్ పేర్కొంది. 

ముకేశ్ అంబానీ ఈ ఏడాది ఏకంగా 27.5 బిలియన్ డాలర్లు సంపాదించి సంపదను 119.5 బిలియన్ డాలర్లకు పెంచారు. ప్రస్తుతం ఆయన నికర విలువ 108.3 బిలియన్ డాలర్లు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ఆయన 13వ స్థానంలో కొనసాగుతున్నారు. టాప్-100 ధనవంతుల సామూహిక సంపద ఈ ఏడాది 40 శాతం పెరిగి 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడం ఓ మైలురాయని ఫోర్బ్స్ పేర్కొంది. గతేడాది ఈ సంపద 799 బిలియన్ డాలర్లుగా ఉండేది.

బలమైన స్టాక్ మార్కెట్, ఐపీవోలు, మ్యూచువల్ ఫండ్స్‌ ధనవంతులను మరింత ధనవంతులుగా మారుస్తున్నట్టు ఫోర్బ్స్ పేర్కొంది. గతేడాదితో పోలిస్తే బీఎస్‌ఈ సెన్సెక్స్ 30 శాతం పుంజుకుంది. జాబితాలో ఉన్నవారిలో 80 శాతం మందికిపైగా అంటే 58 మంది తమ నికర విలువకు బిలియన్ డాలర్లు జోడించినట్టు ఫోర్బ్స్ తెలిపింది.

  • Loading...

More Telugu News