Revanth Reddy: ఆ కమిషన్ నివేదిక వచ్చాకే ఉద్యోగ నోటిఫికేషన్లు: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy about Job notifications

  • ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం
  • 60 రోజుల్లో నివేదిక ఇచ్చేలా ఈ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం
  • నిర్ణీత గడువులోగా నివేదికను సమర్పించాలని ఏకసభ్య కమిషన్‌కు సూచన

ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక వచ్చాకే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం 60 రోజుల్లో నివేదిక ఇచ్చేలా ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ నివేదిక వచ్చాకే నోటిఫికేషన్లు ఇవ్వాలన్నారు. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. 24 గంటల్లో కమిషన్‌కు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఏకసభ్య కమిషన్ నిర్ణీత గడువులోగా నివేదికను సమర్పించాలని సూచించారు. 

ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. నాలుగుసార్లు సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ చివరకు ఏకసభ్య కమిషన్‌ను నియమించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి, కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు, ఇతర అధికారులు సమావేశమై చర్చించి... ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News