Chemistry Nobel Prize: కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ పుర‌స్కారం

Three share Chemistry Nobel for Protein Research
  • డేవిడ్ బెకర్‌, డెమిస్‌ హస్సాబిస్‌, జాన్‌ ఎమ్‌ జంపర్‌కు కెమిస్ట్రీలో నోబెల్‌ బహుమతి
  • ప్రొటీన్ల డిజైన్లపై పరిశోధనలకుగాను ప్ర‌తిష్ఠాత్మ‌క పుర‌స్కారం
  • ఈ మేరకు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్ ప్ర‌క‌ట‌న‌
ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ పుర‌స్కారానికి ముగ్గురు శాస్త్ర‌వేత్త‌లు ఎంపిక‌య్యారు. ప్రొటీన్ల డిజైన్లపై పరిశోధనలకు సంబంధించి కెమిస్ట్రీ శాస్త్రవేత్తలు డెమిస్‌ హసబిస్‌, జాన్‌ ఎం. జంపర్‌, డేవిడ్ బెకర్‌ను నోబెల్ బ‌హుమ‌తి వ‌రించింది. ఈ మేరకు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్ ప్ర‌క‌టించింది. ప్రొటీన్‌ స్ట్రక్చర్ ప్రిడిక్షన్‌కుగాను డెమిస్‌, జంపర్‌.. కంప్యుటేషనల్ ప్రొటీన్‌ డిజైన్‌కుగాను బెకర్‌ ఈ పురస్కారం గెలుచుకున్నారు.

ఇక గతేడాది కూడా ముగ్గురు ర‌సాయ‌న‌ శాస్త్ర‌వేత్త‌లు ఈ అవార్డుకు ఎంపికైన విష‌యం తెలిసిందే. నానో టెక్నాలజీకి సంబంధించి క్వాంటమ్‌ డాట్స్‌ ఆవిష్కరణ, అభివృద్ధికిగాను అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు మౌంగి బవెండి (62), లూయిస్‌ బ్రూస్‌ (80), అలెక్సీ ఎకిమోవ్‌ (78) నోబెల్‌ బహుమతి గెలుచుకున్నారు.
Chemistry Nobel Prize
David Baker
Demis Hassabis
M. Jumper

More Telugu News