AP Govt: భారీ వ‌ర‌ద‌ల త‌క్ష‌ణ సాయంగా ఎన్‌టీఆర్ జిల్లాలో చేసిన ఖ‌ర్చుల వివ‌రాలను వెల్లడించిన ఏపీ ప్రభుత్వం

Details of expenses incurred by the government in NTR district in response to heavy rains and floods

  • ఎన్‌టీఆర్ జిల్లాలో ప్ర‌భుత్వం చేసిన ఖ‌ర్చుల వివ‌రాలను విడుద‌ల చేసిన రెవెన్యూ శాఖ
  • మొత్తం ఖ‌ర్చులు రూ. 139.75 కోట్లు
  • ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన నిధులు రూ. 89కోట్లు
  • చేసిన చెల్లింపులు రూ. 79 కోట్లు  

ఇటీవ‌లి భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల త‌క్ష‌ణ సాయంగా ఎన్‌టీఆర్ జిల్లాలో ప్ర‌భుత్వం చేసిన ఖ‌ర్చుల వివ‌రాలను తాజాగా ఏపీ రాష్ట్ర రెవెన్యూ శాఖ విడుద‌ల చేసింది. మొత్తం ఖ‌ర్చులు రూ. 139.75 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది. ఇందులో ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన నిధులు రూ. 89 కోట్లు కాగా, చేసిన చెల్లింపులు రూ. 79 కోట్లు. ఇంకా అందుబాటులో ఉన్న నిధులు రూ. 10 కోట్లుగా రెవెన్యూ శాఖ వెల్ల‌డించింది. 

ఖ‌ర్చుల వివ‌రాలివే..
  • కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు - రూ.23 ల‌క్ష‌లు
  • తాగునీటి బాటిళ్లు - రూ. 11.22 కోట్లు
  • ఆహార ప్యాకెట్లు - రూ. 57.22 కోట్లు
  • గుడ్లు, పాల ప్యాకెట్లు - రూ. 11.08 కోట్లు
  • బాధితుల‌కు డ్రై ఫుడ్ - రూ. 3.74 కోట్లు
  • స‌హాయ శిబిరాల నిర్వ‌హ‌ణ - రూ. 4.80 కోట్లు
  • మృతుల‌కు ప‌రిహారం - రూ. 1.95 కోట్లు
  • పండ్లు - రూ. 3.64 కోట్లు
  • స‌బ్సిడీ కూర‌గాయ‌లు - రూ. 8.88 కోట్లు
  • ర‌వాణా ఖ‌ర్చులు - రూ. 5.35 కోట్లు
  • మున్సిపాలిటీల‌కు - రూ. 20.56 కోట్లు
  • వైద్యం ఆరోగ్యం కోసం - రూ. 4.55 కోట్లు
  • వ‌స‌తుల ఏర్పాట్లకు - రూ. 2.07 కోట్లు
  • మ‌త్స్య‌కారుల‌కు, ప‌డ‌వ‌ల‌కు - రూ. 89 ల‌క్ష‌లు
  • పోలీసు శాఖ ర‌వాణా ఖ‌ర్చులు - రూ. 2.60 కోట్లు
  • వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చిన హ‌మాలీల‌కు - రూ. 32 ల‌క్ష‌లు
  • ఇత‌ర జిల్లాల నుంచి త‌ర‌లించిన సిబ్బందికి - రూ. 34 ల‌క్ష‌లు.

  • Loading...

More Telugu News